బాధ్యతలు చేపట్టిన నూతన యస్ఐ మల్లిఖార్జునరావు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ గా కొమర మల్లిఖార్జునరావు బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం పొదిలి యస్ఐ గా పనిచేస్తున్న శ్రీహరిని శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ బదిలీ చేసి నూతన యస్ఐ గా కొమర మల్లిఖార్జునరావు ను పొదిలి యస్ఐ నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

శనివారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ యస్ఐ కొమర మల్లిఖార్జునరావు బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ యస్ఐ కొమర మల్లిఖార్జునరావు ను సత్కరించారు