మన బడి నాడు నేడు లాంఛనంగా ప్రారంభం జగనన్న విద్యా కనుకను పంపిణీ చేసిన తహశీల్దారు రఫీ
మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు రఫీ లాంఛనంగా ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆగస్టు 16వ తేదీ నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం సందర్భంగా స్థానిక పొదిలి బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నాడు నేడు ప్రారంభం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహశీల్దారు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ డిల్లీ ప్రభుత్వం ఏ విధంగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం విద్యా సంస్థలను అభివృద్ధి చేసిందో దానికి కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన బడి నాడు నేడు పేరుతో ప్రభుత్వం విద్యా సంస్థలో మౌళిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ సంస్థల దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేసారని అన్నారు.
అనంతరం జగనన్న విద్యా కనుకను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాడు నేడు ప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు, పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి కోటేశ్వరి, డిఇ రామకృష్ణ, ఎఇ నాగరాజు, పాఠశాల అభివృద్ధి కమిటీ మాజీ ఛైర్మన్ కల్లం వెంకట సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు పల్లవి , స్వాములు తదితరులు పాల్గొన్నారు