మండలంలో తొలి కరోనా నిర్ధారణ కేసు నమోదు… అప్రమత్తమైన అధికారులు
మండలంలో తొలి కరోనా నిర్ధారణ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వివరాల్లోకి వెళితే మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమై గ్రామంలో సంబంధిత మహిళ నెలరోజులుగా ఏ కార్యక్రమాలలో పాల్గొంది, ఎవరిని కలిసింది, అలాగే ఆమె సన్నిహితులు కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు శరవేగంగా రామాపురం గ్రామంలో చర్యలు చేపడుతున్నారు.
మండలంలో ఇదే తొలి కరోనా నిర్ధారణ కేసు కావడంతో ఎవరైనా కరోనా లక్షణాలతో బాధ పడుతుంటే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని….. వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లనుండి బయటకు రాకుండా ఉండడం శ్రేయస్కరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.