ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఏమిటి?
మంగ్లీ వేదికపై ఉన్న సమయంలో పొదిలిటైమ్స్ కెమెరాకు చిక్కింది ఆమె చేతిపై ఉన్న ” నాన్న” అనే పచ్చబొట్టు.
ఎంతోమంది సెలెబ్రెటీలు అర్ధం కాని భాషలలో ఏవేవో రాసుకుంటూ ఉండడం సహజం కానీ అమ్మ, నాన్న అనేది చాలా అరుదుగా చూస్తాం అని దీనిపై ఆరా తీయగా ఎంతో పేదరికంలో పెరిగిన మంగ్లీ ఓ ట్రస్ట్ సహకారంతో సంగీతం నేర్చుకోవాలి అనుకున్న సమయంలో ఎంతోమంది అమ్మాయిలకు ఇవన్నీ అవసరమా ఏదొక చదువు చదివితే ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పినా కూడా వారి మాటలు వినకుండా తనకు నచ్చిన దారిలో వెళ్ళమని స్వతంత్రంగా ఉండమని సూచించారని….. చిన్నప్పటి నుండి తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్న ఆయన రాణిస్తున్న రంగంలో ఎంతో ప్రోత్సహం అందిస్తున్నారని ఆయన ప్రేమకు గుర్తుగానే ఆ పచ్చబొట్టు వేయించుకుందని తెలిసింది.