కుందురుకు సియం సహాయనిధి చెక్కులు అందజేసిన పలువురు పౌరులు
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలకు సంబంధించిన చెక్కులను శుక్రవారంనాడు స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి పొదిలి మండలానికి చెందిన పలువురు పౌరులు అందజేశారు.
శ్రీశివకేశవ హోండా షోరూం 10వేల రూపాయల చెక్కును అందజేయగా పట్టణంలో పలువురు పట్టణ పౌరులు తాము తీసిన చెక్కులను శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి సమక్షంలో అందజేశారు.