మార్చి 26 భారత్ బంద్ జయప్రదం చేయండి : సిఐటియు
కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగ ,కార్మిక ,రైతు ,ప్రజావ్యతిరేక విదానాలకు నిరసనగా రైతు ,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మార్చి 26న జరిగే భారత్ బంద్ ను జయప్రదంచేయాలని సిఐటియు రాష్ట్రకార్యదర్శి కె.ఉమామహేశ్వరావు ప్రజలను కోరారు.
వివరాల్లోకి వెళితే బుదవారం నాడు స్థానిక సిఐటియు ఆఫీసులో డి.కె.యం.రఫీ అధ్యక్షతన జరిగిన సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా కె.ఉమామహేశ్వరావు హాజరై ప్రసంగించారు.
ఈ సమావేశంలో సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రదానకార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ రేట్లు పెంచి ప్రజలపై బారాలు మోపటానికి నిరసనగా జిల్లాలో 75 దళాలను ఏర్పాటుచేసి కార్మికవర్గం, ఉధ్యోగులు ,రైతు ,వ్యాపారస్థులు ,ప్రవేట్ విధ్యాలయాల యాజమాన్యం ,విధ్యార్ధి ,యువజనసంఘాలు సహకారంతో బంద్ జయప్రదం కృషి చేస్తామని అన్నారు.
మార్చి 26న భారత్ బంద్ సంపూర్ణంగా జరగటానికి అన్ని తరగతుల ప్రజలు సహకరించాలని అన్నారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లానాయకులు టి రంగారావు ,పి సి కేశవరావు ,టి ఆవులయ్య ,పి రూబెన్ ,ఎ శ్రీనివాసులు , ఆర్ మాలకొండయ్య ,బి నరసింహులు , మురళి ,థామస్ తదితరులు పాల్గొన్నారు.