మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంలో చుక్కెదురు…
న్యూఢిల్లీ : -సుప్రీం కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు చుక్కెదురైంది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. సంస్ధ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించారని మార్గదర్శిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ 2300 కోట్లు డిపాజిట్లు సేకరించిందన్న ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న జీవో నంబరు 800, జీవో నంబరు 801 జారీ చేసింది. ఈ జీవోలకు అనుగుణంగా విచారణ అనంతరం అధీకృత అధికారి కృష్ణంరాజు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.