గ్రామ, వార్డు సచివాలయ నమూనా పరీక్ష నిర్వహించిన మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ
గ్రామ, వార్డు సచివాలయ నమూనా పరీక్షను మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారంనాడు నిర్వహించారు
స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన ఈ నమూనా పరీక్షలో పాల్గొనేందుకు గ్రామ,వార్డు సచివాలయ అభ్యర్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయావకాశాలు ఉంటాయని కాబట్టి ఉద్యోగాలను ఒక ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు కెల్లంపల్లి నజీర్ మాట్లాడుతూ ఈ నమూనా పరీక్షలో మొదటిస్థానంలో నిలిచిన వారికి సోమవారంనాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భవిత పాఠశాల నందు 2,116 ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రాచర్ల కవిత, రమణయ్య, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.