మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు
విశ్వనాధపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని భవిత విద్యాకేంద్రం నందు మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కె.నజీర్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రు జయంతి పురస్కరించుకుని జరుపుకునే బాలల దినోత్సవ వేడుకలలో ప్రత్యేకతను , పిల్లలపై నెహ్రు కు ఉన్న ఆప్యాయత గురించి వివరించారు. భవిత కేంద్రంలోని పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్.జిలాని, నాగూర్ షరీఫ్, రాచర్ల కొండమ్మ, ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, వహిదా తదితరులు పాల్గొన్నారు.