సమ్మె లో మీ-సేవ కేంద్రాలు నిలిచిన పౌర సేవలు
మీ-సేవలను గ్రామ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంతో తమ ఉపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ మీసేవా ఆపరేటర్లు సమ్మె బాట పెట్టినట్లు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా పొదిలి , మర్రిపూడి , కొనకనమీట్ల మండలాల్లో సమ్మె చేస్తున్నామని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మంది ఆపరేటర్లు, 35వేలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని ప్రభుత్వ చర్యల వలన 40వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని ఇటీవల గ్రామసచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వం సచివాలయ పరిధిలోనే మీసేవా తరహా డిజిటల్ సేవలందించేందుకు చర్యలు ప్రారంభించిందిని తాజాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో మీసేవా ఆపరేటర్లు అయినా తాము ఆందోళన బాటపట్టామని వారు తెలిపారు.