మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అన్నదాన కార్యక్రమం

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పొదిలి తూర్పుపాలెంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 21వ తేది బుధవారంనాడు జరిగే మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తూర్పుపాలెంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది ఇప్పటికే దర్గాను సుందరంగా ముస్తాబు చేసి ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలోభక్తులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమానికి హాజరవ్వాలని నిర్వాహకులు తెలిపారు.