గాండ్ల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం మరియు వివాహ పరిచయ వేదిక

ఒంగోలు పట్టణం లోని ఎస్ వి ఎస్ కళ్యాణ మండపము నందు ప్రకాశం జిల్లా గాండ్ల తెలికుల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దాసరి నాగరాజు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం మరియు వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని  రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి గురు స్వామి ప్రారంభించారు..

ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గాండ్ల తెలికుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సంకీస భవాని ప్రియ మాట్లాడుతూ గాండ్ల సంక్షేమ సంఘం మరియు ఉద్యోగుల సంఘం రెండు కళ్ళు లాంటివి కనుక ఐకమత్యంతో ప్రేమానురాగాలతో ఉండాలని కోరారు.

తదుపరి రాష్ట్ర అధ్యక్షులు ఆకుమల్ల నాగేశ్వర్, ఉపాధ్యక్షులు దాసరి గురు స్వామి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమమునకు పాల్గొనడం మంచి శుభసూచకమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరోనా కాలంలో విశిష్ట సేవలు అందించిన గాండ్ల సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఉద్యోగులను ఘనంగా సత్కరించడం జరిగింది

తదుపరి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎద్దుల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల జనాభా
సేకరించాలని, అదేవిధంగా గాండ్ల సామాజిక వర్గం యొక్క జనగణన చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం గాండ్ల తెలికుల సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమమునకు సహకరించిన వరికుంట్ల సురేష్, చిట్టెంశెట్టి వెంకట కృష్ణారావుకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాట్య కళా పరిషత్ డైరెక్టర్ యారం మంజుల, ప్రకాశం జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు బచ్చల శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, సీఈఓ దేవానంద్, రాష్ట్ర నాయకులు కృష్ణం శెట్టి, హేమాద్రి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దాసరి నాగరాజు, వెంకట శేషయ్య. కోటపాటి నారాయణ, బట్టు పిచ్చయ్య, చిట్టెం శెట్టి వెంకట సుబ్బారావు, వరికుంట్ల వెంకటసుబ్బయ్య సర్పంచులు వరికుంట్ల భువనేశ్వరి మాదా సుభద్ర, వరికుంట్ల సుబ్బారావు పాల్గొన్నారు.