వాకా ఆధ్వర్యంలో మర్రిపూడి మండల సర్వసభ్య సమావేశం
మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
శుక్రవారం నాడు స్థానిక మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయంలో నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల మండల అధికారులు తమ శాఖ నందు అమలు అవుతున్న పథకాలు గురించి ప్రగతి గురించి తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ఇంటి నిర్మాణ పనులు గురించి సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి సుజిత, వివిధ శాఖల అధికారులు మరియు ఎంపిటిసి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు