లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : జడ్జి రాఘవేంద్ర
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్ సి రాఘవేంద్ర అన్నారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో పొదిలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి రాఘవేంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 14న జరగబోయే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని….. లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీపడడం వలన సమయం మరియు డబ్బు ఆదా అవుతాయని…. చిన్న చిన్న విభేదాలవలన సంబంధాలు విచ్ఛిన్నం అవుతాయని వాటిని రాజీ చేసుకోవడం వలన సంబంధాలు బలపడడమే కాకుండా స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం వలన శాంతియుత వాతావరణం ఉంటుందని కక్షిదారులకు సూచించారు.
ఈ సందర్భంగా లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీపడే విధంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహాయ సహకారాలు అందించాలని….. పోలీసులు ఎక్కువగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.