ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమానులు
పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా జరిగాయి.
అఖిల భారత చిరంజీవి యువత పొదిలి మండల అధ్యక్షులు ముల్లా సుల్తాన్ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో గత స్థానిక పాత నగర పంచాయితీ కార్యాలయం నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కోసి అభిమానులకు పంచిపెట్టారు.
గత 30 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహిస్తాన్న ముల్లా సుల్తాన్ మొహియుద్దీన్ పలువురు అభినందించారు. అనంతరం నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు పేరుసాముల శ్రీనివాస్ , హనిమున్ శ్రీనివాసులు రెడ్డి ఆదిలక్ష్మి ,రవి రెడ్డి మరియు పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు