రెండు పూటలు ప్రైవేటు పాఠశాలలు నిర్వహణ పై పొదిలి టైమ్స్ కధనంతో కదిలిన విద్యాశాఖ
ఆకస్మిక తనిఖీ లో పలు పాఠశాల తెరిచి ఉండటంపై ఎంఈఓ ఆగ్రహం
తెరిచి ఉన్న పాఠశాల పై నివేదిక తయారు చేసి చర్యలుకై ఉన్నత అధికారులకు సిఫార్సు
ప్లే స్కూల్ విద్యార్థులను తరగతి గదిలో బంధించి తాళం వేయడంపై కలతచెందిన ఎంఇఓ
తనిఖీ లో వెలుగులోకి వచ్చిన అక్రమ హాస్టలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15వ తేది ఒంటి పూట పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించిన పొదిలి నందు ప్రైవేటు పాఠశాలలు రెండు పూటలు పాఠశాలలు నిర్వహించాటంపై పత్రికలులలో వచ్చిన కదనలపై కదిలిన విద్యా శాఖ బుధవారం మాధ్యహ్నం మండల విద్యాశాఖ అధికారి రాఘరామయ్య చెప్పటిన ఆకస్మిక తనిఖీ లో విశ్వశాంతిఆక్స్ ఫర్డ్ ప్రైవేటు విద్యా సంస్థలలో విద్యార్థులుకు తరగతులు నిర్వహించాటం మరియు అధికారులు తనిఖీ కి వస్తున్న విషయం తెలుసుకొన్ని విద్యార్థులను తరగతి గదులో బంధించి తలుపులు వేయడం పై ఎంఇఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు
ఆక్స్ ఫర్డ్ ప్లే స్కూల్ లో చిన్నరిలను తరగతి రూం లో వేసి తలుపులు మూసి వేయటంపై చూసి ఎంఇఓ మనసు కదిలివేసింది అదేవిధంగా రాఘవేంద్ర మహర్షి మంటిసోరి విద్యా సంస్థ లలో కూడా రెండవ పూట తరగతులు నిర్వహించాటం పై వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఈ ఆకస్మిక తనిఖీ లో అక్రమంగా హస్టలు నిర్వహణ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా ఎంఇఓ రాఘరామయ్య మాట్లాడుతూ అక్రమంగా రెండవ పూట పాఠశాల నందు తరగతులు నిర్వహింస్తున్న మరియు ప్రభుత్వం అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్న పాఠశాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులు పంపించి వారు అనుమతి తో చర్యలు చెప్పట్టుతమని ఆయన అన్నారు