ముస్లిం హక్కుల పోరాట సమితి నూతన కార్యవర్గం ఎంపిక
ముస్లిం హక్కుల పోరాట సమితి పొదిలి తాలూకా కమిటీ నూతన కమిటీ అధ్యక్షులుగా షేక్ సులేమాన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజావలి నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు . వివరాలులోకి వెళితే ఆదివారం నాడు స్థానిక చిన్న బస్టాండ్ వద్ద జరిగిన సమావేశంకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు షేక్ ఖాజావలి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పొదిలి లోని అన్యాక్రాంతం అయినా వక్ఫ్ ఆస్తులను స్వాధీనపరుచుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ ఖలీల్,ప్రధాన కార్యదర్శి సయ్యద్, ఉపాధ్యక్షులు షేక్.రఫిజిల్లా కార్యదర్శి షేక్.కరిముల్లా,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జాఫర్ ఖాదర్ బాష,యస్ డాన్, బాజి,మస్తాన్,షేక్ రహ్మాతుల్లా, తదితరులు పాల్గొన్నారు.