మీగడ ఓబులరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన దేశం నాయకులు

పొదిలి మండల తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మీగడ ఓబులురెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్ధానిక విశ్వనాథపురం నందు ఏర్పాటు చేసిన మూడవ వర్ధంతి సభలో మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎనలేని సేవలందించారని నాకు మంచి మిత్రుడని అన్నారు. ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలలో ముందుండేవాడని, తెలుగు దేశం పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేశారని, మాకు మిత్రుడు కావడంతో, ప్రతి సంవత్సరం అయన జ్ఞాపకార్థం వారి వర్ధంతి కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అనంతరం అభిమానులకు పేదలకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మస్తాన్ వలి, సందాని, యస్ధాన్, పాచ్చ, వెంకటేష్, కిషోర్ మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.