ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు

పొదిలి పట్టణంలోని స్థానిక ఎబియం స్కూల్ ఆవరణలో ఆదివారం సాయంత్రం సర్పంచ్ గంగవరపు దీప ఆధ్వర్యంలో మినీ క్రిస్‌మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం క్రిస్‌మస్‌ కేకును కట్‌చేసి ముందస్తుగా క్రిస్‌మస్‌ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ ఏసుప్రభు ప్రజలకు ఇచ్చిన దైవ సందేశ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా క్రిస్‌ మస్‌ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు ఇమ్మడి కాశీనాద్ మాజీ జడ్పీటిసి జైదేవ్ కుమార్ మాజీ మండల పరిషత్ అధ్యక్షులు రవీంద్రనాద్ రమణమ్మ తర్లబాడు సర్పంచ్ కళావతి స్ధానిక తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వరరావు కాటూరి సుబ్బయ్య బాజాజ్ రమణరెడ్డి జ్యోతి మల్లి షేక్ గౌస్ భాష ఫాస్టర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నరు.