మంత్రి శంకర్ నారాయణను కలిసిన పొల్లా
ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమశాఖ మంత్రివర్యులు శంకర్ నారాయణ ప్రకాశంజిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన ఆయనను బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్ కలసి పొదిలి నందు బిసి భవన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేయగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు పొల్లా నరసింహ యాదవ్ పొదిలిటైమ్స్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి, జిల్లా నాయకులు రెడ్డిబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.