మైనర్ బాలిక ఆత్మహత్య

మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలంలోని చింతగుంపల్లి గ్రామానికి చెందిన బొంత అనుషా(17) గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతు బుధవారంనాడు నొప్పికి తాలలేక చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పొదిలి యస్ఐ సురేష్ తెలిపారు.