వైకాపాలో చేరిన మాజీ పంచాయతీ సభ్యులు మీరాబీ

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో పొదిలి గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యురాలు ముల్లా మీరాబీ తన అనుచరులతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు స్ధానిక మసీదుతోటకు చెందిన మాజీ పంచాయతీ సభ్యులు మీరాబీ తన అనుచరులతో మార్కాపురం బయలుదేరి వెళ్లి శాసనసభ్యులు నివాసంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, జి శ్రీనివాస్, కల్లం వెంకట సుబ్బారెడ్డి, ఉలవా గోపి, రమణారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి, చెన్నారెడ్డి, మరియు వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.