శాసనసభ్యులు కుందూరు విస్తృత పర్యటన
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పొదిలి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న శాసనసభ్యులు కుందూరు తొలుత మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో పాల్గొని పలు వినతి పత్రాలను స్వీకరించిన అనంతరం…… ఇంటి నివేశన స్థలాలకు ఎంపిక చేసిన పొలాలను పరిశీలించారు….. అనంతరం తన దృష్టికి రైతుల తెచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా తహశీల్దారుకు తెలిపి పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు అధికారులు మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.