నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి :జంకె వెంకటరెడ్డి
నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని శుక్రవారంనాడు జరిగిన పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు కె.నరసింహారావు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సాధారణ సమావేశంలో జంకె వెంకటరెడ్డి అన్నారు . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని, పొదిలి పట్టణంలోని పారిశుధ్యం అద్వాన్నంగా ఉందని దానిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మండల తహశీల్ధార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ జనవరి 2 నుంచి జరగబోయే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలొ పంపిణీ చేసేందుకు రేషన్ కార్డులు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. విలేకరులకు వికలాంగులకు గతంలో పంపిణీ చేశామని ప్రస్తుతం మరికొన్ని పంపిణీకి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఆర్ డబ్ల్యూ ఎస్ ఎఇ నారాయణ స్వామి మాట్లాడుతూ సాగర్ నీరు రెండు రోజులకు ఒకసారి అందిస్తున్నామని, ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు, యంపీడిఓ రత్న జ్యోతి, మండలంలోని సంబంధిత అధికారులు పాల్గొన్నారు.