తలమల్ల ట్రాన్స్కగ్రిడ్ పనులు పరిశీలించిన : ఎంఎల్ఏ జంకె
పొదిలి మండలం తలమల్ల వద్ద నిర్మాణం లో ఉన్న 400 -220 కెవి ట్రాన్స్కో గ్రిడ్ పనులను మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి పరిశీలించి జరుగుచున్న నిర్మాణాలను విద్యుత్ ఉత్పత్తి సమర్ధ్యంను అధికారుల నుండి అడిగి తెలుసుకొన్నరు ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదించి 2011 లో సుమారు 70 ఎకరాలలో 80 కోట్ల బడ్జెట్ తో మంజూరై 2015 నుండి పనులు ప్రారంభంకాగా వేగవంతంగా పనులు పూర్తి చేస్తే పొదిలి ప్రాంతంలో లోవోల్టాజ్ సమస్యలు తగ్గి పారిశ్రామికంగా కూడా ఉపాధి అవకాశములు వస్తాయని జిల్లాలోనే ఏకైక ట్రాన్స్కో 400 -220 కెవి గ్రిడ్లు (సబ్ స్టేషన్ ) మార్కాపురం నియోజకవర్గం లో ఏర్పాటు కావడం సంతోషమని భవిషత్ లో కొనకనమిట్ల మండలానికి కూడా విద్యుత్ సమస్యలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహారావు జడ్పీటీసీ సాయిరాజ్ మండల వైసీపీ అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ స్ధానక సర్పంచ్ సుబ్బారావు వైసీపీ నాయకులు అంజిరెడ్డి బ్రహ్మ రెడ్డి నారయణరెడ్డి వెలుగోలుకాశీ ట్రాన్స్క్ అధికారులు తదితరులు పాల్గొన్నారు