సచివాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కుందూరు
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని సచివాలయాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
స్థానిక హరికృష్ణ థియేటర్ విధిలో నిర్మాణం పూర్తి అయినా ఐదో సచివాలయాన్ని శనివారం నాడు ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి వివిధ శాఖల అధికారులు మరియు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు