రబ్బానీ ఆధ్వర్యంలో చర్చి నందు దుస్తులు పంపిణీ చేసిన శాసనసభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ ఆధ్వర్యంలో చర్చి నందు మార్కపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు. వివరాలు లోకి వెళ్ళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం నాడు స్థానిక బాప్టిస్ట్ పాలెం లోని చర్చి నందు దుస్తులు పంపిణీ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా దుస్తులను పంపిణీ చేసారు.తొలిత ఫాస్టర్ శాసనసభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ వైసిపి నాయకులు వినోద్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు