రేపు ఎంఎల్ఏ నాగార్జున రెడ్డి పర్యటన
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి రేపు పొదిలి మండలంలో పర్యటిస్తున్నట్లు మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం స్థానిక రోడ్లు మరియు భవనముల అతిథి గృహం నందు ఉదయం 10 గంటలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో బిసిలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటును స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హాజరుకానున్నారని కావున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.