క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన శాసనసభ్యులు కుందూరు
క్రీడాకారులకు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి బహుమతులు ప్రదానం చేసినా కార్యక్రమం గురువారం చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్ళితే గత మూడు రోజులుగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు వివిధ రకాల పోటీలు నిర్వహించి ముగింపు సందర్భంగా పోటీ విజేతలకు బహుమతులను ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా నేత షేక్ నుర్జహన్ మండల వైసిపి నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి వివిధ శాఖల అధికారులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు