కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కుందూరు

పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన పలు రకాల అభివృద్ధి పనులకు సంబంధించి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.

వివరాల్లోకి వెళ్ళితే 3కోట్ల50లక్షల విలువైన జాతీయ ఉపాధి హామీ పథకం మరియు పంచాయతీ సంయుక్త నిధులతో తలపెట్టిన అభివృద్ధి పనులకు ఆదివారంనాడు స్థానిక విశ్వనాథపురం, ప్రభుత్వ వైద్యశాల, తాలూకు ఆఫీస్, రామ్ నగర్, ట్రైలర్స్ కాలనీ, బాప్టిస్టుపాలెం మరియు పంచాయతీలోని పలు ప్రాంతాల్లో పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి,సాయిరాజేశ్వరావు, గుజ్జుల రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, షేక్ రబ్బానీ, షేక్ చోటా ఖాసిం, షేక్ గౌస్ మొహిద్దీన్, ముల్లా యాసీన్, పిన్నిరెడ్డి మాధవరెడ్డి,  పాల్గొన్నారు.