ఎంఎల్ఏ మాజీ ఎంఎల్ఏ ఆరోపణలు తగదు- మూరబోయిన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి పై ఆరోపణలు తగదని కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్ అన్నారు.

నిన్న మార్కాపురంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కాట్రగుంట పంచాయతీ చెందిన కొంతమంది ప్లే కార్డులు పట్టుకొని నిరసన చెయ్యడం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపించారు.

కాట్రగుంట రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న పశుమేత భూములు అక్రమంగా ఆన్లైన్ చేసుకొవటం పై శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకొని రావటంతో సంబంధించిన విషయం విచారణ జరిపించాలని అధికారులను కోరారని సంబంధించిన విషయం ప్రస్తుతం కోర్టు ఉందని వారు అన్నారు.

ఈ విలేకర్ల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు అక్కి దాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షులు శంకర్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ కామసాని వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు