మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా పాలు, పండ్లు పంపిణీ చేసిన బిజేపి నాయకులు
మోడీ 69వ జన్మదినాన్ని పురస్కరించుకుని పొదిలి మండల బిజేపి నాయకులు స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో పాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఆర్టికల్ 370, 35(ఎ)ను రద్దు చేసి 73సంవత్సరాల నుండి జమ్మూ,కాశ్మీర్ ల ప్రజల సమస్యను వారంరోజులలో పరిష్కరించి…. ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన మహోన్నత వ్యక్తిత్వం గల సమర్ధవంతమైన నాయకుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజేపీ మండల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.