మోదీపై పోటీకి అభ్యర్థిని మార్చిన ఎస్పీ …. కారణం ఏమిటి?
భారతప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గ స్థానంలో మోదీకి ప్రత్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ అనూహ్యంగా బిఎస్ఎఫ్ మాజీ సైనికోద్యోగి తేజ్ బహదూర్ యాదవ్ ను ఖరారు చేసింది.
ఇప్పటివరకు స్థానికంగా గట్టిపట్టు ఉన్న షాలిని యాదవ్ పేరు తెరపైకి రాగా అంతర్గత చర్చలు అనంతరం అదే సామాజిక వర్గానికి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ పేరును తెరపైకి తీసుకురావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇంత ఉత్కంఠకు తెరతీసిన ఆ అంశం ఏమిటంటే…… తేజ్ బహదూర్ సైన్యంలో పని చేస్తున్న కాలంలో సైన్యం యొక్క కష్టాలను గురించి ప్రస్తావిస్తూ సరిగా తిండి కూడా పెట్టలేని స్థితిలో భారత ప్రభుత్వం ఉందంటూ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.
ఆ సమయంలో దేశ రక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశంకోసం అహర్నిశలు కష్టపడుతున్న సైనికులకోసం వారు పడుతున్న కష్టాలను తెలియజేసినందుకు భారత ప్రభుత్వం వారి కష్టాలను తీర్చే విధంగా చర్యలు తీసుకోకపోగా…… తేజ్ బహదూర్ యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు అంటూ సస్పెన్షన్ వేటు వేసింది…… కష్టాలను తీర్చమని చేసిన సెల్ఫీ వీడియోకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆనాడు ప్రభుత్వంపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వ్యతిరేకించారు. అప్పటి నుండి తేజ్ బహదూర్ ప్రజలకు మీడియాలో ఎంతో సపరిచితుడయ్యాడు. కొందరు జవాన్లకు హీరోగా నిలిచాడు.
కాగా నిన్నటి వరకు వారణాసిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడు అని ఊహించిన తేజ్ బహదూర్ యాదవ్ తో సంప్రదింపులు జరిపిన మహాకూటమి అనూహ్యంగా సమాజ్ వాదీ పార్టీ తరుపున పోటీ చేయడానికి ఒప్పించి తేజ్ పేరును తెరపైకి తెచ్చింది. అయితే ఇప్పటి వరకు షాలిని యాదవ్ పోటీ చేస్తుందనుకున్న స్థానంలో తేజ్ బహదూర్ పేరును ఖరారు చేయడంలో షాలిని యాదవ్ కూడా ఎటువంటి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా పార్టీ కోసం పని చేయడానికి సిద్ధపడడంతో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలు మారిపోయి మహాకూటమి ఓటు బ్యాంకుతో పాటుగా…. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తేజ్ బహదూర్ ఓటుబ్యాంకు కూడా మహాకూటమికి అనుకూలంగా మారడంతో సమాజ్ వాదీ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
నామినేషన్ల చివరి రోజు అయిన సోమవారంనాడు సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఓ పెను మార్పుకు దారి తీసిందని…… అయితే మే 19న జరగనున్న ఎన్నికల సమయానికి ఎస్పీ, బీఎస్పీలు మోదీకి పోటీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.