వినూత్నంగా మొక్కల పంపిణీ చేపట్టిన సాయి రాజేశ్వరరావు.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు
రాష్ట్రంలోనే మొదటిసారిగా వినూత్న రీతిలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేసే ప్రయోగానికి మాజీ జడ్పీటీసీ సాయిరాజేశ్వరరావు శ్రీకారం చుట్టారు.
వివరాల్లోకి వెళితే విశ్వనాథపురంలోని స్థానిక సాయి రాజేశ్వరరావు హెచ్ పి పెట్రోలు బంకులో మాజీ జడ్పీటీసీ సాయిరాజేశ్వరరావు శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలలో కూడా విశేష ఆదరణ లభించింది. ప్రజలు వారికి కావలసిన మొక్కలు అడిగిమరి తీసుకుని వెళ్తున్నారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు మాట్లాడుతూ వాహనాలు ప్రతిమనిషి జీవితంలో కీలకపాత్ర పోషిస్తున్నందున వాహనాల వలన కాలుష్యం ఏర్పడుతోంది….. అలాగే పెట్రోలు విక్రయదారులుగా మేము కూడా ఆ కాలుష్యానికి ఒక కారణం అయ్యాము అని…. అందువలన పర్యావరణ పరిరక్షణకు మావంతు బాధ్యతగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
ప్రజలు మొక్కలు పెంచేందుకు ఆసక్తి ఉన్నా కూడా వారి వారి పనుల దృష్ట్యా మొక్కల పెంపక కేంద్రానికి వెళ్లి తెచ్చుకోలేకపోతున్న వాహనదారులకు మొక్కలను అందించాలనే సంకల్పంతో… ప్రస్తుతం మొక్కలను పెంచేందుకు వాతావరణం కూడా అనుకూలించడం అలాగే వర్షాలు కూడా పడుతుండడంతో మొక్కల పెంపకానికి అనువైన సమయం కాబట్టి స్థానిక నర్సరీలో లభించే మొక్కలను తీసుకునివచ్చి స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని…. కొన్ని రకాల పూలు, పండ్ల మొక్కలను అడిగి మరీ తీసుకుని వెళ్తున్నారని మొక్కల పెంపకాన్ని ఇష్టపడేవారే తీసుకుని వెళ్లడం ద్వారా మొక్కలు వృధాగా పోయే అవకాశం లేదని…. ఎప్పటికప్పుడు తీసుకున్న వారి పేర్లను నమోదుచేస్తామని… ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 1500పైగా మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన వాహనదారులకు, తోడ్పాటు అందించిన నర్సరీ వారికి, పెట్రోలుబంకు సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.