ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు దాసరి గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తొలుత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యాంత్రిక శక్తిని ఉపయోగించి పారిశ్రామిక మరియు నీటిపారుదలశాఖలో విజయకేతనం ఎగురవేసిన ప్రజ్ఞాశాలి విశ్వేశ్వరయ్య అని….. దేశంలో వరద నీరు పంట పొలాలకు మళ్లించి సస్యశ్యామలం చేయడంలో ఆయనకు ఎవరు సరిలేరు అని….. భారతదేశంలోని నీటిపారుదల శాఖలో ఎన్నో ఆవిష్కరణలు చేసి ప్రపంచంలో తన ప్రతిభను నలుమూలల కనపరిచిన గొప్ప శాస్త్రవేత్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.
ఆయన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించగా…. ప్రతి ఏటా సెప్టెంబర్ 15 వతేదీ నాడు ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి మన జిల్లాకు చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు.
అనంతరం రిటైర్డ్ ఇంజనీర్ మాకినేని రమణయ్య, డిప్యూటీ ఇంజనీర్ రామకృష్ణ, ఇంజనీర్ దంటు నరసింహారావులను ఘనంగా సత్కరించారు.
అనంతరం స్థానిక నీటిపారుదలశాఖ కార్యాలయంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవప్రసాద్, సిఐటియు పశ్చిమ ప్రకాశం నాయకులు ఎం రమేష్ పొదిలినీటిపారుదల శాఖ కార్యాలయ సిబ్బంది ఎల్లయ్య, రామకృష్ణ, రమణ, రమణయ్య, నారాయణస్వామి, నాగరాజు, సి ఆర్ పి శ్రీనివాస కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.