రేపటి నుండి చెరువుల సర్వే ప్రారంభిస్తాం : తహశీల్దార్ ప్రభాకరరావు
పొదిలి పట్టణంలోని చిన్న,పెద్ద చెరువులను సర్వే చేస్తామని మండల రెవెన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాల్లోకి వెళితే ఇటీవల పట్టణంలోని చిన్న, పెద్ద చెరువులను కొంతమంది ఆక్రమించుకుని అక్రమకట్టడాలు నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు స్పందించి సమగ్రంగా సర్వే నిర్వహించి ఇరిగేషన్ అధికారులకు హద్దులను చూపించి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.