తల్లి చేతిలో గాయపడిన కూతురు మృతి
తల్లి చేతిలో గాయపడి కూతురు మృతి చెందిన సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక పంచాయతీ నీటి నిలువ కేంద్ర వద్ద నివాసం ఉంటున్న తల్లీ కుతురులైన గురునాథం ఏడుకొండలు, పోలా మధుబాల మధ్య ఉన్న కుటుంబ కలహాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో తల్లి ఏడుకొండలు రోకలి బండ తీసుకుని కూతురు పోలా మధుబాల(27)పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మధుబాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. క్షతగాత్రురాలు చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందిననట్లు పొదిలి ఠాణా అధికారి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మృతురాలి అక్క వెంకటమ్మ ఫిర్యాదు మేరకు దరిశి సిఐ మోయిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని ఆయన తెలిపారు.