ఘనంగా మదర్ ధెరిస్సా జన్మదిన వేడుకలు

మదర్ థెరిస్సా 109జయంతి వేడుకలు మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

స్ధానిక భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల నందు మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆద్యాపకులు గోపాలకృష్ణ మాట్లాడుతూ మదర్ థెరిస్సాను ఆదర్శంగా తీసుకుని కెల్లంపల్లి నజీర్ వ్యవస్థాపకులుగా మాతృమూర్తి థెరిస్సా సొసైటీ నిర్వహించడం స్పూర్తిదాయకమని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు భోజన వసతిని కల్పించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు రాయపాటి బాజీ, రాచర్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.