పేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ
పొదిలి స్థానిక విశ్వనాధపురం కొండమ్మ మెస్ వద్ద మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎవరి సహాయం కోరకుండా స్వచ్ఛందంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని కొనియాడారు. సంస్థ నిర్వాహకులు కెల్లంపల్లి నజీర్ మాట్లాడుతూ ప్రతి నూతన సంవత్సరానికి పేద విద్యార్థులకు దుస్తుల పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే ఈ నూతన సంవత్సరానికి కూడా దుస్తులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, ఎంపిపి నరసింహారావు, శ్రావణి వెంకటేశ్వర్లు, గంగవరపు దీప, వాకా వెంకటరెడ్డి, ఎస్ ఎమ్ బాషా, రాచర్ల కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.