తల్లిని మించిన దైవం లేదు : షేక్ నజీర్

ఈ జగతిలోని ప్రతి ప్రాణికి తల్లి దైవమని….. తల్లిని మించిన దైవం లేదని మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సోసైటి చైర్మన్ షేక్ కెల్లంపల్లి నజీర్ అన్నారు.

మాతృ దినోత్సవ సందర్భంగా స్థానిక మాతృ ఇన్స్టిట్యూట్ నందు మాతృమూర్తి థెరిస్సా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో షేక్ కెల్లంపల్లి నజీర్ అధ్యక్షతన జరిగిన మాతృ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ చంద్రశేఖర్ మాట్లాడుతూ తల్లి యొక్క గొప్పదనాన్ని, తల్లిని ఎలా గౌరవించాలి, తల్లి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవిస్తూ నేటి ఆచార సాంప్రదాయాలను కొనసాగించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ప్రతి తల్లి తన బిడ్డల కోసం ఎంత కష్టపడుతుందో అలాగే బిడ్డలపై ఎన్ని ఆశలు పెట్టుకుంటుందనే విషయాన్ని గురించి వివరించి వారి ఆశలు నెరవేర్చుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా స్వీట్స్ను పంపిణీ చేశారు.