పొదిలి లో మోటార్ సైకిల్ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ,కార్మిక,రైతు,ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28,28 దేశవ్యాప్త సమ్మ ద్వారా సమరశంఖం పూరించనున్నదని సిఐటియు పశ్చిమ ప్రకాశంజిల్లా ప్రధానకార్యదర్శి యం రమేష్ అన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు పొదిలి పట్టణంలో సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ పొదిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజేషన్ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని సమ్మె జరుగుతుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు ఊడిగం చేస్థున్నాయన్న కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలుకావడంలేదన్నారు.
స్కీంవర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక నష్టపోతున్నారన్నారని కార్మికవర్గం శతాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చటం ద్వారా నిర్వీర్యం చేస్తుందన్నారు.
బారత కార్మిక సంస్థ నిర్ణయించిన కనీసం వేతనాలు అమలు నోచుకోలేదన్ని నెలల తరబడి వేతనబకాయిలు ఉంటున్నాయని అన్నారు.
33నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించలేదని కార్మికులకు హెల్త్ అలవెన్స్ 6000 రూపాయలను 2021జనవరి నుండి చెల్లించాలని,అశుతోష్ మిశ్రా కమీషన్ నివేదిక ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పి.యఫ్.సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, ధరలు పెరుగుదలను నియంత్రించాలని కోరుతూ మార్చి 28,29 దేశవ్యాప్త సమ్మెలో ఆశా,అంగన్వాడీ,మున్సిపల్ కార్మికులు,వి.ఓ.ఎ.,మధ్యాహ్న భోజన పథకం కార్మికులు,స్కూల్ స్వీపర్స్,స్వచ్చబారత్ కార్మికులు,బిల్డింగ్,పెయింటింగ్స్,ట్రైలర్స్,ఎలక్ట్రీషియన్స్,ఆటో,లారీ,కారు,టాక్సి,వి.ఆర్.ఎ.లు అందరూ సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి.మున్సిపల్ వర్కర్స్ &ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)పొదిలి నగర పంచాయితీ అధ్యక్ష కార్యదర్శులు జి.నాగులు, డి.సుబ్బయ్య,నాయకులు కె.వి.నరసింహం, బి.కోటేశ్వరావు, కుమార్. సివిల్ సప్లై ముఠా కార్మికులు కే శేషయ్య, ధర్మయ్య, శ్రీను, రాంబాబు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు