కేంద్రం నిధులు ఇస్తామన్నా కూడా ప్రతిపాదనలు పంపని రాష్ట్ర ప్రభుత్వం- ఎంపి వైవి

కేంద్ర ప్రభుత్వం పొదిలి పెద్ద చెరువులో సాగర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం నాడు పొదిలి పర్యటన లో భాగం తనను కలిసిన విలేకరుల ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితమే పొదిలి పట్టణం మరియు 20 గ్రామాలకు త్రాగునీరు అందించే విధంగా
పెద్ద చెరువులో సాగర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయగా సకాలంలో స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని కోరగా నేటికి పంపించలేదని ఆయన అన్నారు. ఇటీవల అధికారులు కలిసి అడగ్గా రాష్ట్రం మొత్తం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసామని నిధులు కోసం జపాన్ కు చెందిన బ్యాంకు నుండి రుణం మంజూరు కోసం ప్రయత్నం చేస్తున్నామని రుణం మంజూరు కాగానే
ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారని ఆయన అన్నారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని పొదిలి పెద్ద చెరువు లో సాగర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు పనులు ప్రారభించాలని ఆయన అన్నారు . ఎంపి వెంట మార్కాపురం శాసనసభ్యలు జంకె వెంకటరెడ్డి వెన్న, హనమారెడ్డి,షంషీర్ అలీ, మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.