పొదిలి పొగాకు వేలం కేంద్రంన్ని సందర్శించిన -వైవి

పొదిలి పొగాకుబోర్డును సోమవారం ఉదయం ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి సందర్శిచారు. ఒంగోలు నుండి పొదిలి వచ్చిన వైవి సుబ్బారెడ్డికి రహదారులు మరియు భవనాల అతిథి గృహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పొగాకు బోర్డుకు వెళ్లిన వైవి సుబ్బారెడ్డి పొగాకు బేళ్లను పరిశీలించారు పొగాకు కొనుగోలు దారులతో మాట్లాడారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి రైతులకు గిట్టుబాటు ధరపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇకపై ఒక్క రైతన్న ఆత్మహత్య చేసుకున్నా దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి అని హెచ్చరించారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు,త్రాగు నీరు లభిస్తుందని వెలుగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొదిలిలో సమ్మర్ స్టోరేజ్ పనులను త్వరలోనే ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కంది రైతులను ఆదుకోనే దిశగా కందులు మొత్తాన్ని కొనుగోలు చేసేంత వరకు కందుల కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.