నెలసరి వేతనాలకై ఎంపిడిఓ కు వినతిపత్రం ఇచ్చిన ఈ – పంచాయతీ సిబ్బంది

నెలసరి వేతనాలు ఇవ్వాలని కోరుతూ పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి రత్నజ్యోతి కి మరియు ఈఓఆర్డి రంగానాయకులుకు ఆంధ్రప్రదేశ్ ఈ – పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే సోమవారం ఎంపిడిఓ కు వినతి పత్రం అందజేసిన సందర్భంగా విలేకరుల మాట్లాడుతూ తమకు ప్రస్తుతం గంటల పద్దతిలో వేతనాలు ఇస్తున్నారని దానితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాబట్టి జిఓ నెంబర్ 151 ప్రకారం నెలకు 15వేలు నిర్ణిత వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులుకూరి గిద్యోను, గంగవరపు సందీప్, యస్ధాన్, పాల్గొన్నారు.