చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎంపిడిఓ రత్నజ్యోతి
మండలంలోని పలు పంచాయతిలలో జరిగే పెంచిన పెన్షన్లు మరియు ద్వాక్రా మహిళల పసుపు కుంకుమ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ రత్నజ్యోతి కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పెన్షన్లు, మరియు డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ కార్యక్రమాలను గురించి జరిగిన సమావేశం అనంతరం పొదిలిటైమ్స్ ప్రతినిధితో ఎంపిడిఓ మాట్లాడుతూ మండలంలో
పెన్షన్లు, మరియు పసుపుకుంకుమ కార్యక్రమ పంపిణీ 3క్లస్టర్లుగా విభజించడం జరిగిందన్నారు…… ఫిబ్రవరి 2వ తేదీన పొదిలి, కంభాలపాడు, ఉప్పలపాడు, ఏలూరు, కుంచేపల్లి, ఆముదాలపల్లి, కొండాయపాలెం నందు……… 3వతేది సూదనగుంట, మాదాలవారిపాలెం, మల్లవరం, తలమళ్ల, అక్కచెరువు, నందిపాలెం, పాములపాడు నందు…… 4వతేది మూగచింతల, ఈగలపాడు, జువ్వలేరు, తుమ్మగుంట, ఓబులక్కపల్లి, అన్నవరం…… గ్రామ పంచాయతీలలో పెన్షన్లు, మరియు పసుపుకుంకుమ పంపిణీ జరుగుతుందని కావున లబ్ధిదారులందరూ హాజరయ్యి వారికి రావలసిన పెన్షన్లు, పసుపుకుంకుమ కానుకలు అందుకోవాలని పొదిలిటైమ్స్ ద్వారా తెలియజేశారు.