మాదాలవారిపాలెం ఎంపిపి పాఠశాలలో ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిళ్లు పంపిణీ…..
మాదాలవారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అమ్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే మాదాలవారిపాలెం ఎంపిపి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బలగాని నాగరాజు మరియు అమ్మ సేవాసంస్థ సంయుక్తంగా పిల్లలకు మధ్యాహ్న భోజనం సమయంలో అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిల్, తదితరాలను అందజేశారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి సదా కృషి చేస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బలగాని నాగరాజుకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ గురించి, నెహ్రు సేవల గురించి, పిల్లల పట్ల నెహ్రు చూపే ప్రేమాభిమానాలను గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ బలగాని నాగరాజు, అమ్మ సేవాసంస్థ సభ్యులు ఇమాంసా, కఠారి రాజు, అన్నబోయిన కృష్ణయ్య, అఖిలభారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్, రాజు యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.