శెనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వాకా
శెనగ విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
స్థానిక మర్రిపూడి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం నందు శుక్రవారం నాడు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు
అనంతరం వాకా వెంకట రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వ కల్పించిన కనీస మద్దత్తు ధరలకు అమ్ముకోవాలని,దళారీ వ్యవస్థను నమ్మి మోసపోవద్దని అన్నారు.
మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ, శెనగ పంట వేసిన రైతులు ఈ -క్రాప్ బుకింగ్ ప్రామాణికంగా, సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల దగ్గర నుండి ఏపీ మార్క్ ఫెడ్ తరపున ప్రభుత్వ మద్దత్తు ధర కి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇందులో చిన్న /సన్న కారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, అలాగే నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు కల్గిన శనగలు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని అదే విధంగా రైతు యొక్క పంట కొనుగోలు చేసిన 15 రోజుల లోపు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలకు చెల్లింపు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బోగసముద్రం భాస్కర్ రెడ్డి , వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండల కన్వీనర్ బోదా రమణ రెడ్డి , మండల నాయకులు మాచేపల్లి. నాగయ్య , వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు