మండల పరిషత్ పాలకవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే…..
పొదిలి మండల పాలకవర్గాన్ని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి ఘనంగా సత్కరించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన తొలి సమావేశం కావడంతో తొలుత ఎంపిపి నరసింహరావు, జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావులు శాలువా, పూలమాలతో సత్కరించారు.
అనంతరం మండల సర్వసభ్య సమావేశం ప్రస్తుత పాలకవర్గానికి చివరి సమావేశం కావడంతో పొదిలి ఎంపిపి నరసింహారావు, జడ్పీటీసీ సభ్యులు సాయిరాజేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులను శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి శాలువా, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలుశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.