ఓటు హక్కుకు అర్హులైన వారు అక్టోబర్ 31లోపు నమోదు చేసుకోండి
భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని ఓటు హక్కుకు అర్హులైన ప్రతి ఒక్క యువకులు ఫారం-6 ను ఎన్నికల నమోదు అధికారికి కానీ, తహశీల్దార్ కు కానీ, బూత్ లెవల్ అధికారికి కానీ, ఈ నెల 31 అనగా అక్టోబర్ 31 బుధవారం వరకు, లేదా నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ నందు కానీ, సాధారణ సేవా కేంద్రాలైన ఈ సేవ, మీ సేవా, ఏపి ఆన్లైన్ నందు కానీ నమోదు చేసుకోవచ్చునని, ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో జనవరి 1- 2019 నూతన ఓటర్లను నమోదు చేసేందుకు గాను ఫోటో ఎలెక్టరోల్ రోల్స్ స్పెషల్ సమ్మర్ రివిజన్ 2019 లో భాగంగా ఈ ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని, అలాగే భరత ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ ఫోన్: 8367797101 అనే నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా అర్హత కలిగిన వారు ఓటర్లుగా నమోదు చేసుకునే సౌకర్యం ఉందని పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ విద్యాసాగరుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.