తహశీల్దార్ కు అయప్పస్వాముల సన్మానం
పొదిలి మండలమే కాక ఇతర మండలాల అయ్యప్ప లకు మధ్యాహ్నం బిక్షా కార్యక్రమాన్ని పొదిలి లో ఆరైగా పనిచేసి పామూరు సూపర్నెంట్ గా పనిచేసివెళ్ళిన రవిశంకర్ అన్నదానకార్యక్రమం బుధవారం అయ్యప్ప లకు ఏర్పాటు చేయగా మఖ్య అతిథిగా వచ్చిన పొదిలి తాహశీల్దార్ విద్యాసాగరుడు కు అయ్యప్పస్వాములు అఖిలభారత అయ్యప్పదీక్షా ప్రచార సమితి అధ్యక్షుడు అప్పలశంకర్ యక్కలి శేషగిరి చెన్నారెడ్డి ఉదయ్ శంకర్ పూజారులు మురళి వాసు కోటేశ్వరరావు తదితర స్వాములు కలసి దుశ్యాలవాలతో సన్మానించారు. అనంతరం స్వాముల అన్నదానకార్యక్రమం చేసుకునేందుకు స్ధలం కావాలనికోరగా తాహశీల్దారుడు త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.